ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మహానగర్ ప్రాంతంలో 28 ఏళ్ల వయసున్న పవన్ నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఇతడితో పనిచేసే వారితో పరిచయాలున్నాయి. దీనితో తరచూ తను అద్దెకి ఉంటున్న గదికి రమ్మంటూ ఫోన్లు చేస్తుంటారు. వచ్చినవారితో సరదాగా గడపడం అతడి అలవాటు. దీనితో తనకు బాగా పరిచయమున్న 24 ఏళ్ల యువతికి ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. ఆమె వెంటనే అతడి వద్దకు చేరుకుంది. ఇక ఆరోజు రాత్రి ఏమైందో తెలియదు కానీ తెల్లారేసరికి ఆమె శవమై కనబడింది. అతడు పరారీలో వున్నాడు.