హీరో పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం షూటింగ్‌ను ఏ ముహుర్తానా ప్రారభించారో కానీ, అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం దర్శకుడిని మార్చేసిన పవన్ కళ్యాణ్.. తాజాగా కెమెరామెన్‌ను కూడా మార్చేశారు.
ఇపుడు కెమెరామెన్‌ను తప్పించారు. తొలుత 'బెంగాల్ టైగర్'కు సినిమాటోగ్రఫి అందించిన సౌందర్ రాజన్‌ను తీసుకున్నారట. కానీ అనుకున్న టైమ్‌కి సినిమా స్టార్ట్ కాకపోవడంతో.. ఈ మూవీ నుంచి తప్పుకున్నాడట ఈ స్టార్ టెక్నీషియన్. ప్రస్తుతం అతని స్థానంలో 'అత్తారింటికి దారేది'కి పనిచేసిన ప్రసాద్ మూరేళ్లను ఫైనల్ చేశారని సమాచారం. ప్రసాద్ రాకతో పవన్ మూవీ షూటింగ్ స్పీడందుకుంటుందని మూవీ యూనిట్ అంటోంది.
అయితే.. పవన్ సినిమాకు ఇలా టెక్నీషియన్లు మారడం కొత్తేం కాదు. గతంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' విషయంలోనూ కెమెరామెన్లు మారారు. తాజాగా 'కాటమరాయుడు'కూ అదే జరిగింది. దీంతో ఈ సినిమాలో మున్ముందు ఇంకెన్ని మార్పులు- చేర్పులు జరుగుతాయో అని సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు. మరి ఇన్ని మార్పులు 'కాటమరాయుడు'ని సక్సెస్ బాట పట్టిస్తాయో లేదో చూడాలి.