పాయల్ రాజ్ పుత్ రూటు మార్చింది. బెడ్రూమ్ సన్నివేశాలుండే స్టోరీలు మాత్రం వద్దే వద్దు అంటోంది. పాయల్ అంటే అందరూ అడల్ట్ కంటెంట్ వుంటుందని ముద్ర పడిపోయింది. ఆ ముద్రను చెరిపేసేందుకు పాయల్ ప్రస్తుతం రూటు మార్చేసింది. తాను అలాంటి హీరోయిన్ కాదని.. తనకు మంచి సినిమాలు చేయాలని వున్నట్లు చెప్పుకొచ్చింది. దర్శకులు కూడా అలాంటి కథలు తీసుకొస్తే రేటులో రిబేట్ ఇవ్వడానికి కూడా సిద్ధం అంటుంది పాయల్.