ఐదు బెడ్రూమ్ సీన్లు.. అమ్మో వద్దన్న పాయల్ రాజ్ పుత్

శనివారం, 2 నవంబరు 2019 (11:06 IST)
పాయల్ రాజ్ పుత్ తాజాగా ఆర్డీఎక్స్ లవ్ సినిమాలో నటించింది. అయితే వరుసగా బోల్డ్ స్టోరీస్ చేస్తుండటంతో అలాంటి సినిమా ఆఫర్లే వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ హీరోగా డిస్కో రాజా సినిమా చేస్తుంది పాయల్. 
 
ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఈమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ కొత్త దర్శకుడు ఈమె దగ్గరికి ఓ కథ తీసుకొచ్చాడని.. వచ్చీ రావడంతోనే ఇది బోల్డ్ కథ అని క్లారిటీ ఇచ్చేసాడని ప్రచారం జరుగుతుంది. 
 
సరే మంచి కథ అయితే చేద్దాంలే అని కథ చెప్పమంటే.. నెరేషన్ మొదలుపెట్టిన అరగంటలోనే ఐదు బెడ్రూమ్ సన్నివేశాలు చెప్పాడని తెలుస్తుంది. దాంతో పాయల్ రాజ్‌పుత్ చాలా సున్నితంగా ఈ కథను తిరస్కరించిందని.. మొన్నీమధ్యే ఆర్డీఎక్స్ లవ్ సినిమా విషయంలో తాను ఇలాంటి తప్పే చేసానని చెప్పిందని తెలుస్తుంది. 
 
ఇంకా అందుకే ఇప్పట్లో బోల్డ్ కంటెంట్ జోలికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇకపోతే రవితేజ, పాయల్ నటిస్తున్న డిస్కోరాజా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు