నీళ్లు ఎక్కువగా తాగండి.. పాయల్ రాజ్ పుత్

గురువారం, 23 మార్చి 2023 (12:20 IST)
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పాయల్ చేతికి ఐవి ఫ్ల్యూయెడ్స్ పెట్టుకుని షూటింగ్‌లో పాల్గొంది. ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం కోసం అలా చేయలేదు. ఆమెకు ఆరోగ్యం  బాగోలేదని.. దాంతోఐవీ ద్వారా ఫ్లూయిడ్స్ తీసుకుంటేనే ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంది. 
 
ఈ విషయాన్ని తన ఇన్ స్టాలో తెలియజేసింది. ఆమె ఎక్కువగా నీళ్లు తాగకపోవడంతో కిడ్నీ సమస్య వచ్చింది. నీళ్లు ఎక్కువగా తాగకపోవడంతో కిడ్నీ ఇన్ఫెక్షన్‌కి గురైంది. 
 
అందుకే అందరూ నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నానని పాయల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం యాంటిబయోటిక్స్ తీసుకుంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నానని.. అంతా నార్మల్ అవుతుందని బాధపడనక్కర్లేదని చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని రామచంద్రాపురం వద్ద షూటింగ్‌లో పాల్గొంటోంది. "మంగళవారం" అనే సినిమాల్లో నటిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు