సీత, రావణాసురుడు దగ్గరకు హనుమంతుడు వెళ్లినప్పుడు ఏం చెప్పాడో తెలుసా, డా. మోహన్ బాబు
సోమవారం, 17 అక్టోబరు 2022 (16:41 IST)
mohanbabu family
విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం జిన్నా. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు.పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్. దీపావళి సందర్భంగా జిన్నా మూవీని అక్టోబర్ 21న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, 560కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశాను. 75 సినిమాలను నిర్మించాను. శివాజీగారి ఫంక్షన్స్‌లో, మా అన్నయ్య ఎన్టీఆర్‌గారి ఫంక్షన్లో , నాగేశ్వశ్వర రావుగారి ఫంక్షన్లో కృష్ణగారు, కృష్ణంరాజుగారు ఫంక్షన్స్‌లో.. అబ్దుల్ కలామ్ మా ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఆ ఫంక్షన్లో కానీ.. ఎవరూ నన్నెప్పుడూ ఇన్ని నిమిషాలు మాట్లాడాలని చెప్పలేదు. విష్ణు బాబు మాత్రం ఈరోజు నా దగ్గరకు వచ్చి నాన్న ఈరోజు మీరు తక్కువగా మాట్లాడాలి. 50 సంవత్సరాల నట జీవితం నాది. ఎక్కువగా మాట్లాడుతుంటానా, పెద్దవాళ్లు చెప్పలేదే అనిపించింది. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు (నవ్వుతూ..). హనుమంతుడు సీత దగ్గరకు వెళ్లినప్పుడు ఏం చెప్పాడు. రావణాసురుడు దగ్గరకు వెళ్లినప్పుడు ఏం చెప్పాడనేది ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అలాగే మన గురించి మనం చెప్పుకోవాలి.
ఢీ తర్వాత 10 రెట్లు సక్సెస్ సాధించాలి. తను ఇప్పటి వరకు చేయని విధంగా రిస్కీ షాట్స్ చేశాడు. చాలా ఎక్కువగా కష్టపడ్డాడు. కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. నువ్వు బెస్ట్ హీరోవే కాదు, నీకు మంచి మనస్సుంది. కాబట్టి నీకు కుటుంబంలోని వారితో పాటు అందరి ఆశీస్సులుంటాయి. జిన్నా సినిమాకు మూల కథను అందించిన దేనికైనా రెఢీ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డికి, ఆ కథైతే విష్ణుకి బావుంటుందని చెప్పిన కోన వెంకట్‌కి, అలాగే ఛోటా కె.నాయుడు ఎంతో గొప్పగా నా బిడ్డను సినిమాలో చూపించాడు. కోన వెంకట్ రూపంలోనే ఆ భగవంతుడు మా కుటుంబానికి మంచి విజయాన్ని ఇవ్వాలని పంపాడని అనుకుంటున్నాను. నేను కొన్ని సందర్భాల్లో కటువుగా మాట్లాడినా సినిమా కోసమేనని నమ్మి, మంచి ఔట్ పుట్ కోసం కష్టపడ్డ దర్శకుడు సూర్యకు థాంక్స్. ఈశ్వర్ రెడ్డి అయితే 300 జానపద పాటలను అన్వేషించి జారు మిఠాయి సాంగ్‌ను తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ ప్రేమగా సినిమాలో నటించారు. పేరు పేరునా అందరికీ థాంక్స్ అన్నారు.
jijja team
హీరో విష్ణు మంచు మాట్లాడుతూ, జిన్నా నా మనసుకు ఎంతో దగ్గరగా ఉండే సినిమా. నా కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్‌ని ఈ సినిమాకు ఇచ్చావ్. నా హార్ట్ బీట్స్ అయిన ఆరియానా, వివియానా ఈ సినిమాలో తొలిసారి పాట పాడారు. ప్రతీ ఒక్కరికి పేరు పేరునా థాంక్స్. దివి చాలా ఇంపార్టెంట్ రోల్ చేసింది. నందు, భాను.. ప్రభుదేవా మాస్టర్‌కి స్పెషల్ థాంక్స్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ జిన్నా సినిమాలో ఓ గోలిసోడా ఉంది. ఓ జారు మిఠాయి ఉంది. గోలి సోడా పాయల్ రాజ్‌పుత్ అయితే, జారు మిఠాయి సన్నీలియోన్. దీన్ని సినిమా అనటం కంటే, మా మోహన్‌బాబు అన్నయ్య నాపై పెట్టిన బాధ్యత. జిన్నా అనే సినిమా విష్ణు కెరీర్‌కి గొప్ప సెకండ్ ఇన్నింగ్స్ సినిమా అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడూ రెట్టింపుగానే ఉంటుంది. ఈ సినిమాకు అవసరమైన అస్త్రాలన్నీ ఆన్నయ్య వాడేశారు. అందులో ఛోటా కె.నాయుడు, అనూప్ రూబెన్స్, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్, చమ్మక్ చంద్ర అందరూ అస్త్రాలుగా వాడాం. అందరూ గొప్పగా చెప్పుకునే సినిమా అవుతుంది అన్నారు.
చిత్ర దర్శకుడు ఈషాన్ సూర్య మాట్లాడుతూ, మా గురువుగారు శ్రీనువైట్లతో నేను పని చేస్తున్నప్పుడు కోనగారు నా వర్కింగ్ స్టైల్ తెలుసు. అందువల్లే విష్ణుగారికి మంచి కథను తయారు చేసుకుని మోహన్‌బాబుగారి సంస్థలో సినిమా చేయాలనుకున్నప్పుడు నా పేరుని ఆయనే సజెస్ట్ చేశారు. అందుకు ఆయనకు థాంక్స్. తొలి రోజు నుంచి సినిమా పూర్తయ్యే వరకు ఓ ప్రశ్న కూడా వేయకుండా మోహన్ బాబుగారు నా వెంటే ఉండి సపోర్ట్ చేశారు. జిన్నాగా విష్ణు మంచు అదరగొట్టేశారు. ఓ పాటలో స్టెప్ బాగా రావటం కోసం 13 సార్లు చేశారంటే ఆయన కమిట్మెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అన్నారు.
జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిన్నా సినిమా రషెష్ చూశాను. సినిమా బ్లాక్ బస్టర్. ఎవరూ డౌట్ పెట్టుకోనక్కర్లేదు. సక్సెస్‌ను రీచ్ చేసే కెపాసిటీ విష్ణుకి పుష్కలంగా ఉంది. పోస్టర్స్‌పై వేసిన జిన్నా జాతర అనే ట్యాగ్ రిలీజ్ తర్వాత నవ్వుల జాతర అని అందరూ అంటారు. త్వరలోనే జిన్నా బ్లాక్ బస్టర్ జాతర జరుగుతుంది అన్నారు.