ముఖ్యంగా రాజకీయాల్లో పూర్తిగా తలమునకలై వున్న పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడం అంటే మాములు విషయం కాదు. పైగా పవన్ కళ్యాణ్ తను పార్టీ సమావేశాలతో బిజీగా వుంటాననీ, ఏదో ఒకటిఅరా రోజులు ఖాళీ దొరకొచ్చనీ, ఆ రోజుల్లో తను కాల్షీట్లు ఇచ్చేందుకు సిద్ధమన్నారట.
ఐతే ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కార్యకర్తలతో సమావేశాలతో బిజీగా వుంటున్న పవన్ డైలీ హైదరాబాద్ టు అమరావతి ప్రయాణం చేస్తున్నారట. అది కూడా విమానాల్లో. పవన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లేందుకు దిల్ రాజు ఆయన కోసం విమానం టిక్కెట్లు పట్టుకుని రెడీగా వుంటున్నారట. మొత్తమ్మీద పవనిజం గురించి దిల్ రాజు బాగా అర్థం చేసుకున్నట్లున్నారు కదూ.