తొలి ముద్దు అనుభవాన్ని బయటపెట్టిన బుట్టబొమ్మ...

శుక్రవారం, 27 డిశెంబరు 2019 (13:24 IST)
‘రొమాంటిక్ సీన్లు, ముద్దు సన్నివేశాలు థియేటర్లో కూర్చుని చూసే ప్రేక్షకులకు బాగానే ఉంటాయి. కానీ ఆ సన్నివేశాల్లో నటించే యాక్టర్స్ కష్టాన్ని మాత్రం ఎవరూ గుర్తించరు. నా మొదటి సినిమా ‘మొహంజొదారో’, దర్శకుడు అశుతోష్‌ గొవారికర్‌ ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌తో ముద్దు సన్నివేశం ఉంటుందని చెప్పారు. అందుకే నేను ఆ సన్నివేశం కోసం సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆ సమయం వచ్చేసరికి నాలో వణుకు ప్రారంభమైంది.
 
సెట్లో మన చుట్టూ చాలామంది ఉంటారు. వాళ్లందరూ చూస్తుండగా ఇలాంటి సన్నివేశాలలో నటించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా అని ఆ ఫీలింగ్స్ ఏవీ ముఖంలో లేదా కళ్లలో కనిపించకూడదు. శృంగారపరమైన సన్నివేశాలు చేస్తున్నప్పుడు హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యం, లేకుంటే సీన్ తేలిపోతుంది. కొన్నిసార్లు కెమెరా ట్రిక్కులు, టెక్నిక్కులతో ఈ ఇబ్బందుల నుండి తప్పించుకోవడం సాధ్యమవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు