తనతోటి హీరోలంతా ఈ మూడేళ్లలో నాలుగైదు సినిమాలు చేసుకొని చేతులారా సంపాదించుకుంటుంటే ప్రభాస్ మాత్రం బాహుబలిపైనే దృష్టి పెట్టాడు. దానికి తగ్గట్టుగానే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మరి ఈ సినిమాకు ప్రభాస్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంత అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
'బాహుబలి' సినిమాకు రూ.15 కోట్లు వసూలు చేసిన ప్రభాస్.. ఆ తర్వాత చేసే సినిమాకు ఆ రేటును డబుల్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అంటే అక్షరాలా రూ.30 కోట్లన్నమాట. ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న తొలి తెలుగు హీరో ప్రభాస్ మినహా మరెవరూ లేరు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేయబోతున్న సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రభాస్ రూ.30 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని టాలీవుడ్ టాక్.