"బాహుబలి-2" చిత్రం కోసం ప్రభాస్ తెగ కష్టపడుతున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ 130 కేజీల బరువుతో.. చక్కని శరీరాకృతిని సంతరించుకుని టైటిల్‌కి తగిన హీరో అనిపించుకోడానికి కసరత్తులు మొదలుపెట్టాడు. 'బాహుబలి-2' కోసం సిన్సియర్‌గా హోమ్ వర్క్ చేస్తున్నాడట. అందరికీ సినిమాలు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన జక్కన్న.. ఈ 'ఛత్రపతిని'ని మాత్రం లాక్ చేసి పెట్టడానికి ఇదే కారణమట.
ప్రతి రోజు ఉదయం.... సాయంత్రం నిపుణుల పర్యవేక్షణలో ప్రభాస్ వ్యాయామం చేస్తున్నాడు. అలాగే క్రమం తప్పకుండా యోగా కూడా చేస్తున్నాడని చెబుతున్నారు. ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్, డైటీషియన్స్ పర్యవేక్షణలో వర్కౌట్స్ చేస్తూ ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.