రాజమౌళి - కరణ్ జోహార్ రిక్వెస్ట్‌లను తిరస్కరించిన 'బాహుబలి' ప్రభాస్.. ఎందుకో తెలుసా?

ఆదివారం, 7 మే 2017 (16:53 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "బాహుబలి 2". ఈ చిత్రం గత నెలలో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఒక్క చిత్రంతో ఆ చిత్ర హీరో ప్రభాస్ బాలీవుడ్‌లోనూ ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే.. ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ మీడియాకు ఓ హాట్ టాపిక్‌కా మారాడు. 
 
అయితే, ఇటీవల జరిగిన భారీ ప్రమోషన్ ఈవెంట్స్‌కు అతడు హాజరుకాకపోవడం. బాహుబలి సినిమా కోసమే ఐదేళ్ల పాటు అంకితమైన ప్రభాస్.. ప్రస్తుతం అమెరికాలో తన సన్నిహితులతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో లండన్‌లో 'బాహుబలి-2' ప్రత్యేక ప్రదర్శనకు అతడు హాజరు కాలేదట. ఈ ప్రదర్శను చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి స్వయంగా ఆహ్వానించినా.. ప్రభాస్ మాత్రం వెళ్లలేదు. 
 
మరోవైపు బాలీవుడ్‌లో బాహుబలి-2ను దర్శకనిర్మాత కరణ్ జోహార్ విడుదల చేశారు. బాలీవుడ్‌లోనూ ఈ చిత్రం ఘన విజయం సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్‌కు కరణ్ జోహార్ భారీ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. ఈ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులతో పాటు ప్రముఖ మీడియా ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం. 
 
అలాగే, ఈ పార్టీకి ప్రభాస్‌ను కూడా కరణ్ జోహార్ స్వయంగా ఆహ్వానించారట. రెండు రోజుల పాటు బ్రేక్ ఇచ్చి పార్టీలో పాల్గొనాలని కరణ్ చెప్పినా అందుకు ప్రభాస్ అంగీకరించలేదట. పైగా, అమెరికా నుంచి వచ్చాకైనా ఏ డేట్ తనకు వీలుగా ఉంటుందో.. ఆ తేదీనే పార్టీ ఏర్పాటు చేస్తానని కరణ్ చెప్పినా.. అమరేంద్ర బాహుబలి సున్నితంగా తిరస్కరించారట. తనకు పార్టీలంటే పెద్దగా ఇష్టం ఉండదని రాజమౌళి, కరణ్ జోహార్‌లకు చెప్పాడట. అమెరికా టూర్ చెప్పి అటు రాజమౌళి, ఇటు కరణ్ జోహార్ల రిక్వెస్ట్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాడో అర్థంకాక మీడియా పలురకాలైన కథనాలు రాస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి