హీరో తరుణ్‌తో ప్రియమణి పెళ్లి.. నిజమేనా? ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్?

గురువారం, 29 డిశెంబరు 2016 (13:56 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వార్త హాట్‌టాపిక్‌గా మారింది. టాలీవుడ్ యువ హీరో తరుణ్‌ని హీరోయిన్ ప్రియమణి పెళ్లాడబోతుందట. నిజానికి వీరిద్దరు గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయివున్న విషయం తెల్సిందే. తమ ప్రేమాయణంలో భాగంగా అత్యంత విలువైన బహుమతులు, కార్లు ఇచ్చిపుచ్చుకున్నారనే ప్రచారం కూడా సాగింది. 
 
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ ప్రియమణి. ఇటీవలే ప్రకాష్ రాజ్ 'మాఊరి రామాయణం' నటనతో ఆకట్టుకొంది. అయితే, ప్రస్తుతం అవకాశాల్లేకుండా ఖాళీ ఉంటోంది. కమెడియన్ అలీ నిర్వహిస్తోన్న టీవీ షో 'అలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైంది. 
 
అలీతో కలసి సరదా సరదాగా మాట్లాడిన ప్రియమణి.. అప్పట్లో ఎవరో ఫోన్ చేసి.. మీరు తరుణ్‌ని పెళ్లాడబోతున్నారంట కదా.. ? ఆయన మీకు కాస్ట్లీ కారుని కూడా గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకొంటున్నారు. ఇది నిజమేనా..? అంటూ అడిగారని చెప్పుకొచ్చింది. వాస్తవానికి అలాంటిదేమీ లేదంటూ నవ్వేసింది. 

వెబ్దునియా పై చదవండి