ప్రియాంక అరుళ్ మోహన్‌కు బంపర్ ఆఫర్.. పవర్ స్టార్‌తో రొమాన్స్?

మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (15:06 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రియాంక అరుల్ మోహన్‌కు భారీ ఆఫర్ వచ్చింది. కోలీవుడ్ హీరోయిన్లలో అగ్రహీరోయిన్‌గా పేరు గాంచిన  ప్రియాంక తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించేందుకు సిద్ధం అవుతోంది. 
 
దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఓజీ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా సెట్ అయ్యిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
ఈ సినిమా రెగ్యులర్ ప్రొడక్షన్ ఈ వారంలో ప్రారంభమవుతుంది. డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఓజీ’ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కనుంది. పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. 
 
ఇకపోతే.. నేచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ శ్రీకారం సినిమాల్లో నటించింది. తాజాగా రవితేజ రావణాసుర చిత్రంలో కూడా కనిపించబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు