''కాంచనమాల కేబుల్ టీవీ'' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన హీరోయిన్ లక్ష్మీరాయ్. ఈ హీరోయిన్ తెలుగులో నటించిన చిత్రాలు తక్కువే అయినా, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించి తన హవా కొనసాగిస్తోంది. ఈ మధ్యనే ఈ భారీ అందం బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. హిందీ చిత్రం ''జూలీ-2'' లో ఇప్పటికే టూ పీస్, స్విమ్ దుస్తుల్లో నటించి బాలీవుడ్ వర్గాలను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందీ భామ. బాలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలి చిత్రం.