శివానీతో జతకట్టనున్న శివ? ఈ శివ ఎవరో తెలుసా?

గురువారం, 27 జులై 2017 (17:32 IST)
సినీ నటుడు రాజశేఖర్ వారసురాలు శివానీ తెరంగేట్రం ఖరారైపోయింది. శివాని తొలి సినిమా ఎవరితో వుంటుందనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్ పెద్ద చర్చ సాగుతోంది. ఇప్పటికే ఫోటో షూట్‌లో అదరగొట్టేసిన శివానీ.. హీరోయిన్‌గా ఎప్పుడు తెరపై కనిపిస్తుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు 'శివ'తో శివానీ జతకట్టనుందని టాక్. 
 
ఈ కుర్రాడు విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ ఏడాది చదువు పూర్తి కానుండటంతో, అతడిని హీరోగా పరిచయం చేసేందుకు రాజ్ కందుకూరి ప్లాన్ చేసుకుంటున్నాడని తెలిసింది. అలా శివను హీరోగా నటించే సినిమాలో శివానిని హీరోయిన్‌గా తీసుకోవాలని రాజ్ కందుకూరి భావిస్తున్నారట. 
 
ఈ చిత్రం జనవరి 2018లో సెట్స్ పైకి వస్తుందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని.. నటనలోనూ ట్రైనింగ్ తీసుకున్నాక శివ.. శివానీతో జత కలుస్తాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇక శివానీ తన సూపర్బ్ ఫోటో షూట్‌తో ప్రేక్షకుల మధ్య హీరోయిన్‌ రోల్‌కు అదిరిపోతుందని ముద్ర వేసుకుంది.

వెబ్దునియా పై చదవండి