జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో సంభవించిన తీవ్ర వాతావరణ సంఘటనలు భారతదేశం అంతటా కనీసం 1,528 మంది ప్రాణాలను బలిగొన్నాయి. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలు అత్యంత దెబ్బతిన్న రాష్ట్రాలలో ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం తెలిపింది.
ఇందులో 935 మంది వరదలు, భారీ వర్షాల కారణంగా మరణించగా, 570 మంది పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలకు గురయ్యారు. మరో ఇరవై రెండు మంది ప్రతికూల వాతావరణం కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇందులో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 290 మంది మరణించారు. వీరిలో వరదలు. భారీ వర్షాల కారణంగా 153 మంది మరణించగా, పిడుగుల కారణంగా 135 మంది మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లో 141 మంది మరణించారు. వీరిలో దాదాపు అందరూ కుండపోత వర్షాల వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వలన మరణించారు.
జమ్మూ కాశ్మీర్ తర్వాత 139 మంది మరణించారు. బీహార్‌లో 62 మంది మరణించారు, వీరందరూ పిడుగుపాటుకు సంబంధించినవారే. ఇందులో ఉత్తరప్రదేశ్ మరో తీవ్ర వరద ప్రభావితమైన రాష్ట్రంగా నిలిచింది. ఈ రాష్ట్రంలో 201 మంది మరణించారు.
జార్ఖండ్‌లో 129 మంది మరణించగా, అత్యధికంగా 95 మంది పిడుగుపాటుకు గురయ్యారు. గుజరాత్‌లో 31 మంది, ఢిల్లీలో ముగ్గురు, ఒడిశాలో 36 మంది మరణించారు. ఇలా దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి చెందారని ఐఎండీ పేర్కొంది.