అయితే, ఈ చిత్రాన్ని విడుదలకు ముందే ఆన్లైన్లో లీక్ కాకుండా అడ్డుకోవాలంటూ నిర్మాత కలైపులి ఎస్ థాను హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 225 వెబ్ సైట్లు, మరికొన్ని డౌన్ లోడింగ్ పైరసీ సైట్లను బ్లాక్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
అయితే, డార్క్ వెబ్సైట్లో ఈ చిత్రానికి సంబంధించిన అనేక లీకులు ఉన్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ లింకులను తీసేయాల్సిందిగా తాము సైబర్ నేర విభాగాన్ని కోరినట్లు చిత్రబృందం తెలిపింది. అయితే ఈ వదంతులు సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపవని యూనిట్ సభ్యులు అంటున్నారు.