2024లో పెళ్లి చేసుకోవాలని రకుల్, జాకీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పెద్దగా ఆలస్యం చేయకుండా ఫిబ్రవరిలోనే పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 22న గోవాలో వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైనట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏర్పాట్ల విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రకుల్ చేతిలో ఓ హిందీ సినిమాతో పాటు తమిళ సినిమా కూడా ఉంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న "భారతీయుడు- 2"లో ఈ భామ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా శివకార్తికేయన్ సరసన "అయలన్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా మేరీ పట్నీ కా హిందీ రీమేక్‌లో కూడా రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది.