కట్ చేసి.. విషయానికి వస్తే, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఇద్దరి మధ్య అంటే నారా లోకేష్, పవన్ కల్యాణ్‌ల మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రజల మధ్య ఇద్దరి సోదరుల బంధం మళ్ళీ ప్రదర్శితమైంది.
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అనుమతించే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బస్సు ఎక్కారు.
ఈ సందర్భంగా.. పవన్ కళ్యాణ్ బస్సు టికెట్ చెల్లించడానికి చిల్లర ఎంచుకుంటుండగా, లోకేష్ వెంటనే కలగజేసుకుని.. అన్నయ్యకు టికెట్ కొన్నాడు. ఆ క్షణంలో పవన్ కళ్యాణ్ ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఈ సంఘటన అందరిలో నవ్వుల పూయించింది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.