పవన్‌తో ఇప్పుడే సినిమా వద్దు వద్దు.. కాజల్‌లా మారనంటున్న రకుల్ ప్రీత్ సింగ్..

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (15:16 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నటించే గోల్డెన్ ఆఫర్ వస్తే రకుల్ ప్రీత్ సింగ్ వద్దనుకుందట. ఏఎం రత్నం నిర్మాణంలో, పవన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌ను సంప్రదించారట. అయితే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కాల్షీట్స్‌తో బిజీగా ఉండటంతో.. పవన్ మూవీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

అయితే అమ్మడు పవన్ ఆఫర్‌ను తిరస్కరించేందుకు కారణం ఉందని సినీ జనం అంటున్నారు. మెగా యంగ్ హీరోలతో జతకడుతున్న రకుల్.. ఒక్కసారిగా సీనియర్ అయిన పవన్‌తో ఛాన్స్ రావడంతో కాల్షీట్ల సాకుతో నో చెప్పిందని చెప్తున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోలతో చేస్తూ.. కెరీర్‌లో అవకాశాలు సన్నగిల్లాక.. కాజల్ అగర్వాల్‌లా సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీల్లో నటించినట్లు.. సీనియర్ల సరసన నటిస్తే సరిపోతుందిలే అని రకుల్ అనుకుంటుందట. 
 
ఇకపోతే.. టాలీవుడ్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్న భామ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం ద్వారా తెలుగులో తొలి విజయాన్ని అందుకున్న రకుల్ స్టార్ హీరోల సరసన నటించే గొప్ప అవకాశాన్ని అందుకుంది. కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్ ఇలా బడా హీరోల సినిమాలలో కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం మహేష్ బాబు, మురుగదాస్ భారీ బడ్జెట్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న రకుల్, బెల్లంకొండ శ్రీనివాస్ తాజా ప్రాజెక్టులోను నటిస్తోంది.

ఇవే కాక పలు తమిళ సినిమాలు కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయని సమాచారం. ఇక మెగా హీరోలతో బ్రూస్ లీ, సరైనోడు, ధృవ సినిమాలు చేసింది. తాజాగా సాయిధరమ్‌తో కలిసి విన్నర్ సినిమా చేసింది. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో పవన్‌తో బంపర్ ఆఫర్ వచ్చినా రకుల్ నటించేందుకు నో చెప్పిందని సినీ పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి