సన్నగా పొడ్డుగ్గా అందంగా... లేతగా... రకుల్ ప్రీత్ సింగ్ స్ట్రక్చర్ కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. ఇపుడు దాన్ని మరింత ఎక్సర్‌సైజ్ చేసి మరింత స్లిమ్ చేసేస్తోందంట రకుల్. ఎందుకిలా అని అడిగితే... నేను స్ప్రింటర్ అవుతున్నానంటోంది ఈ అమ్మడు. హీరోయిన్ రకుల్ ఇపుడు ఓ కొత్త సినిమాలో క్రీడాకారిణి రోల్ చేయబోతోంది. గోపీచంద్ మలినేని, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రకుల్ కథానాయికిగా సెలెక్టయింది.
ఈ మూవీలో రకుల్ యువ క్రీడాకారిణిగా ప్రేక్షకులను పరుగులు తీయించనుంది. తన మేని అందాలతో కుర్రకారును ఉరకలు ఎత్తించాలంటే.. ముందు తాను పరుగెత్తాలని అంటోంది ఈ స్లిమ్ గర్ల్. అసలే ఎక్సర్‌సైజ్ అంటే రకుల్‌కి పిచ్చి... ఇపుడు స్ప్రింటర్‌గా కనిపించడం తనకు సంతోషంగా ఉందని, దీని కోసం ఫిట్‌గా అవ్వాల్సి ఉందని, అందుకోసం మరింత ఎక్సర్‌సైజ్ చేస్తున్నానంటోంది. తక్కువ కెలరీల శక్తి ఉన్న ఆహారం తీసుకుంటున్నానని.. తనకు ఇష్టమైన ఆహారానికి దూరమవుతున్నా... స్ప్రింటర్ అవుతున్నా అనే ఆనందంగా ఉందని చెపుతోంది.