పాకిస్తాన్ మళ్లీ డ్రోన్ దాడులకు తెగబడింది. జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ ప్రాంతాల లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. భారత సైన్యం వీటిని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. తనకు కూడా పేలుళ్ల శబ్దం వినిపిస్తోందని జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఎవరూ వదంతులను నమ్మవద్దనీ, వీధుల్లోకి రాకుండా ఇళ్లకే పరిమితం కావాలంటూ ఆయన పేర్కొన్నారు. మరోవైపు జమ్మూ డివిజన్ ఉదంపూర్ మొత్తం బ్లాక్ అవుట్ ప్రకటించారు. ఆ ప్రాంతమంతా సైరన్ శబ్దాలతో మారుమోగుతోంది. కొన్నిచోట్ల ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేసారు.
కొంతమంది అంతే. ప్రాణాలను పణంగా పెట్టి సాయం చేస్తే, సాయం చేసినవారికే ద్రోహం తలపెడుతుంటారు. ఇప్పుడు టర్కీ చేసిన ద్రోహం ఇలాంటిదే. 2023లో టర్కీలో భారీ భూకంపం సంభవించి విలవిలలాడుతున్నప్పుడు భారతదేశం 8.5 లక్షల డాలర్ల విలువైన సామగ్రిని ఆ దేశానికి అందించి ఆదుకుంది. ఈ సహాయాన్ని టర్కీ దేశాధినేతలు మరిచిపోయారు.