ఇప్పటికే క్లైమాక్స్, నేక్‌డ్, పవర్ స్టార్ వంటి చిత్రాలు నిర్మించాడు. వీటిని ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యాయి. తాజాగా వర్మ మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి 'ఆర్జీవీ మిస్సింగ్' అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా ఓ విషయం చెప్పుకోవాలట. ఈ చిత్ర హీరో ఎవరోకాదు.. స్వయంగా రాంగోపాల్ వర్మేనట.
థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌గా రానున్న ఈ చిత్రం మరి సెట్స్ పైకి వెళ్లిందా..? లేదా షూటింగ్ షురూ కావాల్సి ఉందా..? అనేది తెలియాల్సి ఉంది. వర్మ హఠాత్తుగా ఈ మూవీ ట్రైలర్‌ను చూపించి, సినిమా విడుదల చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఏది ఏమైనా ఆర్జీవీ స్పీడును అందుకోవాలంటే ఇప్పుడున్న దర్శకులకు కష్టమైన పనే అని చెప్పాలి.