ప్రభాస్‌పై మనసుపారేసుకున్నా సీనియర్ నటి.... అందరిలాగే ఆమెకూ డార్లింగేనట...
మంగళవారం, 15 ఆగస్టు 2017 (11:05 IST)
టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అదీ కూడా బాహుబలి హీరో ప్రభాస్ గురించే. జస్ట్ ఫర్ ఉమన్ (జేఎఫ్ డబ్ల్యు) ఫొటో షూట్ లో పాల్గొన్న ఆమెను మీడియా పలకరించగా పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘బాహుబలి’ హీరో ప్రభాస్ గురించి ప్రశ్నించగా.. ‘అతను అందరికీ డార్లింగే’ అని చెప్పుకొచ్చింది.
ఇకపోతే... ‘నరసింహ చిత్రంలో మీరు పోషించిన నీలాంబరి పాత్ర అంటే ఇష్టమా? పంచతంత్రం సినిమాలో మరఘతవల్లి అలియాస్ మాగీ పాత్ర అంటే ఇష్టమా?’ అని ప్రశ్నించగా.. నీలాంబరి పాత్ర అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చింది.
‘మీరు నటించిన సినిమాల్లో మీ మనసుకు బాగా నచ్చిన పాత్ర? అని ప్రశ్నించగా.. ‘బాహుబలి’ చిత్రంలోని శివగామి పాత్ర అని ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా చెప్పింది.