నటుడు నాని ఈ చిత్రాన్ని సమర్పిస్తారని చెబుతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో రాణి ముఖర్జీ పాల్గొనే అవకాశం ఉందనే వార్తలు బాలీవుడ్ వర్గాల్లో కూడా ట్రెండ్ అవుతున్నాయి. చిరంజీవి 158వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-పొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నది. త్వరలోనే నటీనటులను, సాంకేతిక నిపుణులను ఖరారు చేస్తారట.