ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌కు, ఆమెకు ఎఫైర్ అంటూ గుసగుసలు తరచుగా వినిపిస్తుంటాయి. అలాగే చలాకీ చంటి ఆమెకు అవకాశాలిపిస్తాడని కూడా కొన్ని రూమర్లున్నాయి. వీటి గురించి రష్మి తనదైన శైలిలో స్పందించింది. ''చంటి నాకు మంచి ఫ్రెండ్. అయితే అతడికే సినిమాల్లో సరైన అవకాశాలు లేవు.
అలాంటిది నాకు ఛాన్సులిప్పిస్తాడా? ఇంతకీ అతను నాకు ఎన్ని ఛాన్సులిప్పించాడో.. ఆ సినిమాలేవో చెప్పండి చూద్దాం. నాకు, చంటికి రూమర్లంటే ఇష్టం. ఎప్పుడైనా కలిసినపుడు రూమర్ల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక సుడిగాలి సుధీర్తో ఎఫైర్ గురించి ఏం చెప్పాలి. యూట్యూబ్లో.. సోషల్ మీడియాలో నేను ట్రెండ్ కావడం నాకిష్టం. నన్ను మరింత ఫేమస్ చేయండి. నా గురించి ఇంకా చాలా మాట్లాడండి. ఇలాంటి వాటిని నేను ఎంజాయ్ చేస్తూనే ఉంటాను" అని రష్మి ఘాటుగా సమాధానమిచ్చింది.