ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప'లో నటిస్తోంది. మరోవైపు తమిళ సినీ పరిశ్రమలో కూడా రష్మిక సత్తా చాటబోతోందట. కోలీవుడ్ నుంచి తాజాగా రష్మికకు బంపర్ ఛాన్స్ వచ్చిందట.
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా తెరకెక్కబోతున్న చిత్రంలో రష్మికకు ఛాన్స్ వచ్చిందట. నిజానికి విజయ్ 'మాస్టర్' చిత్రంలోనే రష్మిక నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు కుదరలేదు. ఆ సినిమాలో రాకపోయినా విజయ్ 65వ చిత్రంలో ఛాన్స్ రష్మికను వరించిందట. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట.