బాహుబలి హీరో ''సాహో"లో ప్రభాస్ హీరోయిన్‌గా రష్మిక..?

శుక్రవారం, 12 మే 2017 (16:47 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక సినిమా బాహుబలిలో అమరేంద్ర బాహుబలిగా, శివుడిగా మెప్పించిన ప్రభాస్.. సాహో సినిమా షూటింగ్‍లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే దానిపై సోషల్ మీడియా రచ్చ రచ్చ జరుగుతోంది. కొందరు కత్రినా అయితే ప్రభాస్‌ సరసన సరిపోతుందంటే.. మరికొందరు అనుష్కను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకోవాలన్నారు. 
 
రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ డైరెక్షన్‌లో ''సాహో'' అనే టైటిల్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రభాస్ కొత్త సినిమాకు కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. కన్నడంలో 'కిరిక్ పార్టీ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, తన తొలి సినిమాతోనే మంచి పేరు కొట్టేయడంతో రష్మికను కథానాయికగా తీసుకోవాలని టీమ్ యోచిస్తోంది. ఇంకేముంది..? రష్మికకు అదృష్టం అలా తలుపు తడుతుందన్నమాట.

వెబ్దునియా పై చదవండి