రవితేజతో మైత్రీ మూవీస్ రెండు సినిమాలను ప్లాన్ చేసింది. అందులో ఒక సినిమా అమర్, అక్బర్, యాంటోని ఒకటి. ఈ సినిమాకు దర్శకుడు శ్రీనువైట్ల. సినిమా షూటింగ్ బాగా జోరుగా సాగుతోంది. మరొకటి కందిరీగ డైరెక్టర్‌తో మూవీ. కందిరీగ డైరెక్టర్ తో వారంరోజుల పాటు సినిమా షూటింగ్ జరుపుకుని సినిమా ఆగిపోయింది. ప్రస్తుతానికి ఈ సినిమాను నిలిపివేశారట.
రవితేజ వరుసగా ఫ్లాప్ లు ఇవ్వడంతో ఒకటైంలో దర్సక, నిర్మాతలు వెనక్కి తగ్గారు. సంవత్సరం తరువాత రాజా దిగ్రేట్ సినిమా తీశారు. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ తరువాత రెండు సినిమాలు తీశారు టచ్ చేసి చూడు, నేల టిక్కెట్లు వచ్చాయి. ఆ సినిమాలు కోట్ల రూపాయల్లో నష్టాలు వచ్చాయి. దీంతో మొదట్లో రెండు సినిమాలు తీయాలనుకున్న నిర్మాణ సంస్ధ ఒక సినిమాను పక్కనబెట్టి ఒక సినిమాను మాత్రమే తీయాలని నిర్ణయించుకుందట.