మెగా కాంపౌండ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రతి ఒక్క నటి ఉబలాటపడుతుంటారు. అలాంటి హీరోయిన్లకు మెగా ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తున్నారు. అలాంటి అవకాశాన్ని తెలుగు చిత్రపరిశ్రమలో ఐరెన్ లెగ్‌గా పేరుపొందిన రెజీనా కాసాండ్రా కొట్టేసింది. ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం దక్కినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మాస్ గీతం పెట్టనున్నారట.