మెగా ఇంటి కోడలు కాబోతోన్న రీతు వర్మ

సోమవారం, 23 అక్టోబరు 2023 (08:50 IST)
హీరోయిన్ రీతు వర్మ మెగా ఇంటి కోడలు కాబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె మెగా కుటుంబ సభ్యుల ఫంక్షన్లకు మాత్రమే హాజరవుతుందట. 
 
సాయిధరమ్ తేజ్‌ను లేదంటే అల్లు శిరీష్.. వీరిద్దరిలో ఒకరిని ప్రేమిస్తోందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి మాదిరిగా ఉంగరాలు మార్చుకొని చెప్పేంతవరకు ఈ సస్పెన్స్ తప్పదేమో అనిపిస్తోంది.
 
పెళ్లి చూపులు సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది రితూవర్మ. ఈ అమ్మడు అటు, తెలుగు, తమిళం, మళయాళ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. హోమ్లీగా కనిపించడం ఈ ముద్దుగుమ్మ బలం. ఈ హోమ్లీనెస్ కారణంగానే ఆమె మెగా ఇంటి కోడలు అయ్యేందుకు క్వాలిఫై అయినట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు