సమంత వేలికి రింగ్... చైతూతో నిశ్చితార్థం జరిగిపోయిందా...?

బుధవారం, 27 జులై 2016 (13:27 IST)
టాలీవుడ్ సెక్సీ క్వీన్ సమంత, నాగచైతన్యల గురించి ఇటీవలి కాలంలో జరుగుతున్న చర్చకు మరికాస్త వేడి రాజుకుని చర్చ మరింత ముందుకు వెళుతోంది. అదేంటయా అంటే... తాజాగా సమంత చేతి వేలికి నిశ్చితార్థానికి పెట్టుకునే ఉంగరం ఒకటి కనబడుతోంది. ఈ ఉంగరం చూసిన దగ్గర్నుంచి సినీ పిల్లజర్నలిస్టులు ఒకటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
సమంతకు నాగచైతన్యతో రహస్యంగా నిశ్చితార్థం జరిగిపోయిందంటూ వారు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు నాగచైతన్య స్వయంగా తన ప్రియురాలు సమంత కోసం ఓ ప్లాటినమ్ ఉంగరం ఒకదాన్ని కొని తెచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ వార్తలన్నిటినీ కొట్టిపారేస్తున్నారు మరికొందరు. ఐతే సమంత మాత్రం దీనిపై ఎలాంటి కామెంట్ చేయడంలేదు మరి.

వెబ్దునియా పై చదవండి