కీర్తి సురేష్ ఆడియో విని షాక్ అయిన సమంత రూత్ ప్రభు.. ఏంటది?

సెల్వి

గురువారం, 16 జనవరి 2025 (14:55 IST)
Keerthy Suresh
మహానటిలో కలిసి గడిపిన తర్వాత సమంత రూత్ ప్రభు, కీర్తి సురేష్ మంచి స్నేహితులు అయ్యారు. ఒక ఇంటర్వ్యూలో కీర్తి తన కోసం వాయిస్ మెసేజ్ పంపినప్పుడు సమంత ఆశ్చర్యపోయింది. ఆమె తన బలాన్ని ప్రశంసించింది.
 
కీర్తి తనను సోదరి అని వాయిస్ నోట్ పంపడం ఎంతో సంబరపడిపోయేలా చేసిందని సమంత తెలిపింది. సమంతను ఫీనిక్స్ అని పిలుస్తానని.. అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. తన రహస్యాలను పంచుకోవడానికి కీర్తి తనకు ఎంతగానో నచ్చుతుందని సమంత వెల్లడించింది. 
 
సమంత పోరాట స్ఫూర్తి కీర్తికి స్ఫూర్తినిస్తుంది. ఆమె సమంతను ఎంతగానో నమ్ముతుంది. ఇందులో భాగంగానే తొలుత కీర్తి ఆంథోనీ థటిల్‌తో తన రహస్య సంబంధం గురించి ఆమెతో మాత్రమే పంచుకుంది. 
 
నిజానికి కీర్తి, సమంతా మంచి స్నేహితులు, ఎందుకంటే వారు ఒకరికొకరు అతి పెద్ద సీక్రెట్ కీపర్‌లు కూడా. సమంత నాకు ఈ విషయంలో చాలా సలహాలు ఇచ్చేది. ఆమె రిలేషన్‌షిప్ సలహాలు, సూచనలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. బేబీ జాన్ సినిమాకు నన్ను సిఫార్స్ చేసింది కూడా సమంతనే అని కీర్తి ఇప్పటికే వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు