ఇటీవలికాలంలో ఉమైర్ సంధు తెలుగు చిత్రపరిశ్రమను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద ట్వీట్లు చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఒక ఉమనైజర్ అని, మహేష్ బాబు, పూజా హెగ్డేల మధ్య ఏదో ఉందంటూ ట్వీట్స్ చేశారు. వీటిపై ఆ హీరోల ఫ్యాన్స్ రెచ్చిపోయి ఉమైర్ సంధును తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇపుడు తాజాగా సమంతను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
సమంతను నాగ చైతన్య చాలా వేధించాడని, చైతూ ఒక బ్యాడ్ హస్బెండ్ అంటూ విమర్శించారు. ఆయన వల్ల సమంత శారీరకంగా, మానసికంగా అనుభవించిందని పేర్కొన్నాడు. పైగా, నాగ చైతన్య కారణంగా సమంత గర్భందాల్చినప్పటికీ ఆమె అబార్షన్ చేయించుకున్నారని ఉమైర్ సంధు పేర్కొన్నారు. దీంతో ఆయనపై మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అబార్షన్ చేయించుకున్నాననే విషయం నీకు సమంత చెప్పిందా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.