స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం నెరపిన ఓ వ్యక్తి చివరికి హత్యకు గురైన ఘటన బెంగళూరులో జరిగింది. నమ్మిన స్నేహితుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ కలిసి తన ప్రాణాలు తీస్తారని ఊహించలేకపోయిన ఆ భర్త కథ విషాదాంతమైంది. వివరాల్లోకి వెళితే.. విజయ్ కుమార్ (39), ధనుంజయ అలియాస్ జై చిన్ననాటి స్నేహితులు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేసే విజయ్ కుమార్‌కు సుమారు పదేళ్ల క్రితం ఆశ అనే మహిళతో వివాహమైంది. వీరు కామాక్షిపాళ్యలో నివాసం ఉండేవారు.
అయితే, కొంతకాలంగా తన భార్య ఆశ, స్నేహితుడు ధనుంజయ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు విజయ్ కుమార్ గుర్తించాడు. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా చూసినట్టు సమాచారం. ఈ విషయంపై భార్యను విజయ్ కుమార్ మందలించినట్లు తెలుస్తోంది.
అయినప్పటికీ ఆశ, ధనుంజయ తమ బంధాన్ని రహస్యంగా కొనసాగించినట్టు తెలుస్తోంది. ఇక అడ్డుగా వున్న విజయ్‌ని తొలగించుకోవాలనే ఈ క్రమంలో విజయ్ కుమార్‌ను ఆశ, ధనుంజయ ఇద్దరూ కలిసి కుట్ర పన్ని ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.