రైల్వే క్లర్క్ పాత్రలో సమంత, మాజీ క్రికెటర్ పాత్రలో చైతూ..

మంగళవారం, 27 నవంబరు 2018 (13:59 IST)
టాలీవుడ్ అందాల రాశి సమంత ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత గల పాత్రలకు ప్రాధాన్యతనిస్తోంది. గ్లామర్ తారగా ఓ వెలుగు వెలిగిన సమంత.. ప్రస్తుతం కథకు, నటనకు ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకుంటోంది. తాజాగా 70 ఏళ్ల వయస్సు గల వృద్ధురాలి పాత్రలో సమంత నటించేందుకు అంగీకరించింది. మిస్ గ్రానీ అనే కొరియన్ మూవీ రీమేక్‌లో సమంత నటించనుంది. 
 
2014లో విడుదలైన ఈ కొరియన్ మూవీ సినీ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. దాంతో దర్శకురాలు నందినీ రెడ్డి తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. కొన్ని రొజులుగా ఫిల్మ్ నగర్‌లో ఈ వార్త వినిపిస్తూనే వుంది. నందినీరెడ్డి, సమంత కాంబోలో తెరకెక్కబోయే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. సమంత కెరీర్‌లో ఇది చెప్పుకోదగిన సినిమాగా మిగలనుంది. ఈ సినిమాకు నిర్మాతగా సురేష్ బాబు వ్యవహరించనున్నారు. 
 
ఇదిలా ఉంటే నవంబర్ 23 చైతూ పుట్టిన రోజు. ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకునేందుకు చైతన్య తన భార్య సమంతతో కలిసి గోవా వెళ్లారు. ఇందుకు సంబంధించి ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సమంత, చైతు నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ అనే సినిమాలో నటిస్తున్నారు. 80స్ నాటి కథతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇందులో రైల్వే క్లర్క్ పాత్రలో సమంత, మాజీ క్రికెటర్ పాత్రలో చైతూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు