ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

సిహెచ్

శుక్రవారం, 3 అక్టోబరు 2025 (23:46 IST)
ఆకు కూరలలో పోషకాలు చాలా ఉన్నాయి. అందుకే తప్పనిసరిగా వీటిని తింటుండాలని చెబుతారు వైద్య నిపుణులు.
 
విటమిన్లు: విటమిన్ A (బీటా కెరోటిన్ రూపంలో), విటమిన్ C, విటమిన్ E, విటమిన్ K, విటమిన్ B వుంటాయి.
 
ఖనిజాలు (మినరల్స్): ఇనుము (ఐరన్), కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, మాంగనీస్.
 
పీచు పదార్థం (ఫైబర్): ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది.
 
ప్రోటీన్: తక్కువ మొత్తంలో ఉన్నా, క్యాలరీలతో పోలిస్తే అధిక శాతంలో ఉంటుంది.
 
యాంటీ ఆక్సిడెంట్లు : ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
 
ఆకు కూరలు సాధారణంగా క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకు వంటివి సాధారణంగా తినే ఆకు కూరల్లో కొన్ని.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు