టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంతతో చెర్రీ చిక్కు తప్పట్లేదు. జనతాగ్యారేజ్ సినిమా తర్వాత చెర్రీతో సమంత నటించనుందని వార్తలొచ్చాయి. అయితే ఆమెకు పెళ్లి కుదరడంతో ఎలా సినిమాల్లో పనిచేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అమ్మడు అదంతా ఏమీ లేదని.. పర్సనల్ పర్సనలే కెరీర్ కెరీరే అనే చందంగా దూసుకెళ్లింది. ఇంతలో అఖిల్ అక్కినేని పెళ్లి రద్దు అయ్యిందని వార్తలొచ్చాయి.
అఖిల్ పెళ్లి రద్దు కారణంగా ఈ ఏడాది చివరిలో జరగాల్సిన చైతూ-సమంత పెళ్ళిని కాస్త ముందుకు తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ కారణంగా చెర్రీ-సుక్కూ ప్రాజెక్ట్‌కి సమంత నో చెప్పినట్టు టాక్. పెళ్లి కారణంగా షెడ్యూల్స్‌కి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉందనే విషయాన్ని ముందుగానే గమనించిన సమంత.. చెర్రీకి సారీ బాస్ అని చెప్పేసిందట. మరి ఈ వార్తల్లో ఎంతమటుకు నిజం ఉందో తెలియాలంటే సమ్మూ స్పందించాలి.