చైతూ-సమ్మూ పెళ్లెప్పుడు..? రారండోయ్ వేడుక చూద్దాం.. అని చెప్పేదెప్పుడు.. ఫ్యాన్స్ ప్రశ్న

శనివారం, 13 మే 2017 (12:58 IST)
సమంత, నాగచైతన్య ప్రేమ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. కానీ అఖిల్ పెళ్లి ఆగిపోవడంతో.. చైతూ పెళ్లి సంగతేంటి? అంటూ అక్కినేని ఫ్యాన్స్ అడుగుతున్నారు. సమ్మూ-చైతూ పెళ్లి వేడుకను చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. అయితే వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కానీ నాగ్ ఫ్యామిలీ మాత్రం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారని.. కాస్త ఫ్రీ అయ్యాక పెళ్లి పెట్టుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. దాదాపు అక్టోబర్‌లో వీరి పెళ్లి వుంటుందని సమాచారం.
 
నాగ చైతన్య ఇప్పటికే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో నటించాడు. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత చందు మొండేటి, ప్రేమమ్ మూవీ బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ మూవీ లోనూ చైతూ నటించనున్నాడట. ఈ సినిమాలన్నీ పూర్తవడానికి ఏడాది పట్టే అవకాశం ఉంది. అలాగే సమంత విషయానికి వస్తే… నాగార్జునతో రాజు గారి గది2, రామ్ చరణ్‌తో మరో మూవీలో నటిస్తుంది. 
 
అంతే కాదు.. తమిళ్‌లో విజయ్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. విశాల్ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించనుంది. సావిత్రి బయోపిక్‌లోనూ నటిస్తోంది. ఈ సినిమాలు పూర్తి చేయడానికి ఏడాది పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైతూ-సమ్మూ పెళ్లి ఎప్పుడు జరుగుతుందోనని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. చేతిలో వున్న సినిమాల షూటింగ్ పూర్తయ్యాక చేసుకుంటారా? లేకుంటే షూటింగ్ ఆపేసి వివాహం చేసుకుంటారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి