శాంతి స్వరూప్ పరిస్థితి బాగా లేదట, కానీ..?

శుక్రవారం, 30 జులై 2021 (23:17 IST)
జబర్ధస్త్. ఎంతోమంది కళాకారుల టాలెంట్‌ను బయటకు తీసుకొచ్చిన కామెడీ షో. స్కిట్లో ఒక్కొక్కరు చేసే ఫర్మాన్సెస్ అబ్బా అనిపించేలా ఉంటుంది. కడుపుబ్బ నవ్వించేలా సాగే ఈ కామెడీ షోతో ఎంతోమంది బుల్లితెర నుంచి వెండితెరపైకి వెళ్ళిపోయారు. కొంతమందికి మంచి ఆఫర్లు కూడా వచ్చాయి.
 
అయితే ఈ షోలో అబ్బాయిలు అమ్మాయిల క్యారెక్టర్లు కూడా వేస్తూ వచ్చారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శాంతిస్వరూప్ గురించి. మహిళ గెటప్‌లో అతడు చెప్పే డైలాగ్‌లు అదుర్స్. అలాగే హైపర్ ఆది స్కిట్లో ప్రత్యేకంగా నిలిచేది శాంతి స్వరూప్.
 
హైపర్ ఆది ప్రతి స్కిట్లో శాంతి స్వరూప్ కామెడీ అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. అతడిపై వేసే సెటైర్లు ఆ విధంగా ఉంటాయి మరి. అయితే  జబర్ధస్త్‌లో నటించిన వారు బాగా సంపాదించారుగా అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో తాజాగా శాంతి స్వరూప్ ఒక వీడియోను రిలీజ్ చేశారు.
 
నాకు జబర్ధస్త్ మంచి మైలేజ్ ఇచ్చిన మాట వాస్తవమే. అయితే ఎవరూ కోట్లు సంపాదించేయలేదు. నాకు ఎప్పటి నుంచో కారు కొనాలని ఉంది. కారు కొనుక్కోవడానికి చాలా కష్టపడ్డా. ఎన్నో రోజులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలాగోలా ఒక జిప్సీని కొన్నాను. 
 
ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. నాకు ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు. అతనే నేర్పుతున్నాడు. నా కలల కారు ఇదే అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసాడు శాంతి స్వరూప్. ప్రతినెలా ఇ.ఎం.ఐ ఖచ్చితంగా కట్టాల్సిందే. లేకుంటే తెలుసుగా అంటూ అసలు విషయాన్ని బయటకు చెప్పేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు