జబర్దస్త్: డబుల్ మీనింగ్ షోగా మారిపోయిందా? వీడియో వైరల్ (video)

శనివారం, 12 జూన్ 2021 (14:20 IST)
జబర్దస్త్ ఒకప్పుడు మంచి కామెడీ షోగా గుర్తింపు పొందింది. కానీ రాను రాను ఈ షో మొత్తం కామెడీ తగ్గి డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో బాగా రెచ్చిపోతుంది. దీంతో ఈ షో పట్ల ప్రేక్షకులు కూడా చూడటానికి అంత ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా ఇందులో చేసే కమెడియన్ హైపర్ ఆది తన పంచ్ డైలాగ్స్‌తో మంచి గుర్తింపు అందుకున్నాడు. కానీ ఈయన కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోతూ అభిమానుల దృష్టిలో ఓ వ్యతిరేకతను అందుకుంటున్నాడు.
 
తాజాగా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఇక అందులో హైపర్ ఆది ఎంట్రీతో రష్మీతో కలిసి ఓ సాంగ్‌తో డాన్స్ చేశారు. ఇక రష్మీ డ్యాన్స్ చేస్తూ వెళ్తున్న సమయంలో.. రష్మీ హైపర్ ఆది తో ఇక వెళ్లాలా? అయిపోయాయా మీ కోరికలు అని అనగా వెంటనే హైపర్ ఆది వెళ్ళు వెళ్ళు లేకపోతే వేరే కార్యక్రమం దగ్గర నువ్వు ఎందుకు అని రష్మీ మీద సెటైర్ వేస్తాడు ఆది.
 
ఇక మరో లేడీ గెటప్ తో వచ్చిన కమెడియన్ చూసి షాక్ అవుతూ వెంటనే మంచం కిందికి దూరుతాడు ఆది. ఇక తను ఏవండి బయటకు రండి నేను ఉండలేను అనగా.. నేను బయటకు వస్తే అని గ్యాప్ ఇచ్చి ఓ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేయగా రోజా, రష్మీ తెగ నవ్వుకున్నారు. ఇక ఇది చూసిన నెటి జనులు మాత్రం జబర్దస్త్ షో గురించి కామెంట్స్‌తో నింపుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు