అధర చుంబనాలే ఆ హీరోయిన్‌కు ప్లస్.. బాలీవుడ్లో అదరగొడతానంటూ ధీమా..

శనివారం, 7 సెప్టెంబరు 2019 (21:02 IST)
లేటైనా లేటెస్ట్ అన్నట్లుగా షాలినీ పాండేకు లక్ లక్కలా పట్టుకుంది. మొన్నటివరకు ఒక్క సినిమా కోసం నానా తిప్పల పడ్డ ఈ భామకు ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ నుంచే భారీ ఆఫర్లు వచ్చిందట. అది కూడా ఏకంగా మూడు సినిమాలకు ప్యాకేజీ. అంటే ఈ మూడు సినిమాలో ఏది పెద్ద హిట్ అయినా షాలినికి మరికొంతమంది కెరీర్ పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
 
అయితే ఇదేమీ చిన్న ఆఫర్ కాదు. బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యశిరాజ్ ప్రొడక్షన్ వాళ్ళు షాలినితో మూడు సినిమాలకు కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఇందులో ఫస్ట్ మూవీనే రణ్ వీర్ సింగ్ తో ఉంటుందట. మామూలుగా రణవీర్ కథాబలంలేని సినిమాలను ఒప్పుకోరట. అందుకే ఈ సినిమా షాలినికి పెద్ద ప్లస్ అవుతుందన్న ప్రచారం ఉంది. 
 
దివ్యాంగ్ టక్కర్ అనే కొంత్త దర్సకుడితో రెండవ సినిమా కూడా చేయనుంది షాలినీ పాండే. వచ్చేనెల సినిమా సెట్స్ మీదక వెళ్ళబోతోందట. అలాగే మూడో సినిమా కూడా కథ కూడా సిద్థంగా ఉందట. తమిళ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసిందట షాలిని. మొత్తం మీద షాలినీ నటన నచ్చడం వల్లే ఆమెతో భారీ కాంట్రాక్ట్ చేసుకున్నట్లు యశోరాజ్ సంస్ధ ప్రతినిధులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు