వకీల్ సాబ్ కోసం గబ్బర్ సింగ్ భామ.. ఫైనల్ అయినట్టేనా?

గురువారం, 19 మార్చి 2020 (16:41 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పింక్ ఆధారంగా తెరకెక్కుతోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజుతో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, మగువ మగువ లిరికల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 
 
పవన్‌కల్యాణ్ పవర్‌ఫుల్ లాయర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో అంజలి, నివేదా థామస్ నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా పవన్‌కు జోడీగా ఎవరు నటిస్తారనే విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇలియానా నటిస్తుందని, లేదా లావణ్య త్రిపాఠిని అడుగుతున్నారని, వీరిద్దరూ కాదు శృతిహాసన్ నటించే అవకాశాలే ఎక్కువగా వున్నాయని టాక్ వస్తోంది. 
 
అయితే తాజాగా ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా శృతిహాసన్‌ని చిత్ర బృందం ఫైనల్ చేసింది. శృతిహాసన్ గతంలో పవన్‌తో కలిసి `గబ్బర్‌సింగ్‌`, కాటమరాయుడు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న `క్రాక్‌` చిత్రంలో నటిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు