కోలీవుడ్ హీరోయిన నయనతార. ఇప్పటికే రెండు ప్రేమల్లో మునిగితేలి, ఆ తర్వాత వారితో తెగదెంపులు చేసుకుంది. ఇపుడు తమిళ యువ దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. ఇంతలో మరో యువ హీరోపై ఆమె మనసు పారేసుకున్నట్టు కోలీవుడ్ వర్గా సమాచారం. ఆ యువ హీరో ఎవరో కాదు శివకార్తికేయన్.
ఈ యువ హీరో నటించిన తాజా చిత్రం వేలైక్కారన్. ఇందులో నయనతార హీరోయిన్. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్‌ను నయనతార ఆకాశానికెత్తేస్తోంది. శివకార్తికేయన్ కూడా తన స్నేహితుల వద్ద నయనతార దండకం చదువుతున్నాడట. నయనతార ప్రత్యేకతలు, యాక్టింగ్ టాలెంట్ గురించి తెగపొగుడుతున్నాడట.
ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో నయనతార సహనటుడు శివకార్తికేయన్ గురించి మాట్లాడుతూ, అతను చాలా సరదా వ్యక్తి. షూటింగ్ స్పాట్‌లో ఆయన ఉంటే సందడికి ఏ మాత్రం కొదవ ఉండదు. ముఖ్యంగా పనిభారం, ఒత్తిడి అస్సలు తెలీదని తెలిపింది. ఒక వైపు నటిస్తూనే సెట్‌లో పని చేసే వారిని నవ్విస్తుంటారని తెలిపింది.