సౌందర్య ఆస్తులతో రఘు మస్తు మజా.. గోవాలో వేరే అమ్మాయితో?

శనివారం, 22 ఏప్రియల్ 2017 (12:51 IST)
మహానటి సావిత్రికి తర్వాత సినీ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు సాధించిన సౌందర్య.. 2004లో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కెరీర్‌లో మంచి ఆఫర్లతో ముందుకెళ్తున్న సౌందర్య విమాన ప్రమాదంలో మృతి చెందిన సంగతి విదితమే. అయితే సౌందర్య భర్త రఘు.. ఆమె పట్ల గౌరవప్రదంగా నడుచుకునేవాడని, రఘు-సౌందర్య వివాహ జీవితం ఎంతో సాఫీగా, గొడవలు లేకుండా ఉండేదని ఇప్పటికీ మంచి పేరుంది. 
 
కానీ ఇటీవల రఘు ప్రవర్తన మారిందని.. ఆతడు గోవాలో ఒకమ్మాయితో కనిపించాడని వార్తలు వస్తున్నాయి. ఆ అమ్మాయి ఎవరు? గోవాలో ఆమెతో కలిసి తిరుగుతున్న రఘు.. సౌందర్య ఆస్తులను ఏం చేశాడనేదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 17వ తేదీన సౌందర్య వర్థంతి ముగిసిన నేపథ్యంలో.. సౌందర్య భర్త రఘు రహస్యంగా వివాహం చేసుకున్నాడని.. ఆయనకంటూ ఓ ఫ్యామిలీ ఉందని తెలుస్తోంది. సౌందర్యను కోల్పోవడాన్ని ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేక శోకంలో ఉన్నారు. కానీ రఘు మాత్రం సీక్రెట్‌గా వివాహం చేసుకుని సౌందర్య ఆస్తులతో మజా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 
 
గోవాకు చెందిన డాక్టర్ అర్పితను 2010లోనే రఘు వివాహం చేసుకున్నాడని బెంగళూరు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ఇటీవల గోవాలోని హోటళ్లో గడిపినట్లు సమాచారం. కానీ సౌందర్య మరణంతో తమకు చెప్పకుండా అల్లుడు రెండో పెళ్లి చేసుకోవడంపై ఆమె తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కూతురిని కోల్పోయిన తమకు అల్లుడు కుమారుడిలా ఉంటాడనుకుని సౌందర్య ఆస్తులను ఆతనికి అప్పగించామని.. ఇలా వేరొక ఫ్యామిలీ ఆతను హ్యాపీగా ఉంటాడనుకోలేదని వారు వాపోతున్నారని టాక్ వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి