ఆరడుగుల ఎత్తు వుండే శ్రద్దాదాస్ కారేటే బ్లాక్ బెల్ట్ కూడా. ఇలాంటి కథతో సినిమా చేయాలనుందని గతంలో చెప్పింది. కానీ ఆమెకు గ్లామర్ రోల్స్ మాత్రమే వస్తున్నాయి. డార్లింగ్, నాగవల్లి వంటి పెద్ద సినిమాలు చేసినా ఆమె ఆ తర్వాత వెనుకడుగు వేసింది.
ఇప్పటి భామలు తనకంటే బాగా నటిస్తున్నారనీ, గ్లామర్ పాత్రలు పోషిస్తున్నారని కామెంట్ కూడా చేసింది. కరోనా కాలంలో నిరీక్షణ, అస్త్రం వంటి సినిమాలు చేసింది. ఆ తర్వాతు ఆమె కెరీర్ అంతగా లేదు. తాజాగా రెండు భాషల్లో రాబోతున్న ఓ భారీ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.