సల్మాన్ ఖాన్ రొమాంటిక్ హిందీ మూవీ "మైనే ప్యార్ కియా" ద్వారా హీరోయిన్గా పరిచయమైన నటి భాగ్యశ్రీ. "ప్రేమపావురాలు" సినిమాతో తెలుగు ప్రేక్షక హృదయాలను ఉర్రూతలూగించింది. ఆ తరువాత బాలకృష్ణ హీరోగా నటించిన యువరత్న రాణా సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా, రాజశేఖర్ హీరోగా నటించిన ఓంకారం సినిమాలోను నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ఆదరణ సంపాదించుకున్న నటి భాగ్యశ్రీ .ఆ తరువాత పలు హిందీ, మరాఠి, కన్నడ, భోజ్పురి సినిమాల్లో భాగ్యశ్రీ నటించారు. సుమారు రెండు దశాబ్దాల తరవాత తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధేశ్యామ్"చిత్రంతో తన సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి తల్లిగా నటిస్తూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భాగ్యశ్రీ పాత్రికేయులు తో ముచ్చటించారు.