Sreeleela: 2025లో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఖాయమా? కరణ్ జోహార్ చేతిలో పడితే?

సెల్వి

శుక్రవారం, 3 జనవరి 2025 (17:11 IST)
వరుస ఫ్లాప్‌ల కారణంగా కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రీలీల 2024 చివరిలో పుష్ప2తో తిరిగి వచ్చింది. ఆమె పుష్ప-2లోని కిస్సిక్ ఐటెమ్ సాంగ్‌లో ఆమె నటన బాలీవుడ్‌ను షేక్ చేసింది. ఇంకా అక్కడ ప్రజల ఆదరణ పొందింది. 
 
'పుష్ప 2' హిందీలో అత్యంత విజయవంతమైన చిత్రంగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు హిందీ మార్కెట్‌లో మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఆమెను ఓ బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు బాలీవుడ్ దర్శకులు ప్రయత్నిస్తున్నారు. 
 
ఇప్పటికే వరుణ్ ధావన్ చిత్రంలో శ్రీలీల తన అరంగేట్రం చేయాల్సింది. అయితే ఆమె స్థానంలో పూజా హెగ్డేని తీసుకున్నారు. అయితే, కరణ్ జోహార్ తన రాబోయే ప్రాజెక్ట్‌లలో ఒకదానిలో ఆమెను నటించడానికి ఎంచుకున్నట్లు టాక్ వస్తోంది. ఇకపోతే.. శ్రీలీల నితిన్‌తో నటించిన రాబిన్‌హుడ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు