దేవసేనకు జక్కన్న వార్నింగ్... ఆరు వారాలే గడువు

శనివారం, 16 జులై 2016 (14:02 IST)
‘సైజ్‌ జీరో’ అంటూ అక్కర్లేని ప్రయోగాలు చేసి చిక్కుల్లో పడింది టాలీవుడ్‌ జేజమ్మ అనుష్క. ప్రస్తుతం బాహుబలి- 2 షూటింగ్ సెట్ పైన ఉన్న సంగతి తెలిసిందే. సైజ్ జీర్ సనిమా కోసం అప్పుడు అనుష్క బరువు పెరిగిన సంగతి విదితమే. కాగా ఆ పెరిగిన బరువు తగ్గించుకోవడానికి ఈ ముద్దుగుమ్మ నానాపాట్లు పడుతుందట. ఆ బరువు తగ్గాలనీ  రాజమౌళి ఆమెకు గట్టి వార్నింగ్‌ ఇచ్చాడట. 
 
అంతేకాదు యోగా ద్వారా ఫలితం ఉండదని లైపో ట్రీట్‌మెంట్‌ తీసుకోమని అనుష్కకు రాజమౌళి గట్టిగా చెప్పాడట! మరో ఆరు వారాల్లో బరువు తగ్గి షూటింగ్‌కి హాజరు కావాలని కూడా అన్నాడట! ఓ విధంగా వార్నింగ్‌లా ఉన్న రాజమౌళి మాటలు విన్న అనుష్క ఇప్పుడు అయోమయంలో పడింది. యోగాతో పాటు డైటింగ్‌, ఎక్సర్‌సైజులు విపరీతంగా చేస్తూ బరువు తగ్గించుకోవడానికి అమ్మడు బాగానే కష్టపడుతున్నప్పటికీ, ఇవి ఏవీ రాజమౌళి పట్టించుకోకుండా అలాంటి మాటలు మాట్లాడటం అనుష్కను బాధించాయని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి