ఆ దర్శకుడు ఓ రాత్రి హోటల్‌లో ఉండమన్నాడు... బాలీవుడ్ నటి సుచిత్ర

శుక్రవారం, 14 జులై 2023 (13:38 IST)
బాలీవుడ్ నటి, గాయని సుచిత్రా కృష్ణమూర్తి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని వెల్లడించారు. ఓ దర్శకుడు తనతో ఇబ్బందిగా ప్రవర్తించాడని వాపోయింది. ఓ రోజు రాత్రి ఆ దర్శకుడు తనతో హోటల్ నుంచి రేపు ఉదయం ఇంటి వద్ద దింపుతానని చెప్పినపుడు చాలా భయమేసిందని, దీంతో తాను అక్కడ నుంచి పారిపోయానని వెల్లడించింది. ప్రాజెక్టు సమావేశాల కోసం అపుడపుడు దర్శకులను హోటళ్ళలో కలవడం సహజమేనని చెప్పారు. ఏ సినిమాకు సంబంధించిన సమావేశాలు అయినా దాదాపు హోటల్స్‌లోనే జరుగుతాయన్నారు. ఓ సినిమాకు తాను కూడా ఓ దర్శకుడిని హోటల్‌కు వెళ్లి కలిసినట్టు చెప్పారు.

హోటల్‌ గదిలో ప్రాజెక్టు గురించి చర్చించుకునే సమయంలో మీకు మీ నాన్న అంటే ఇష్టమా.. అమ్మ అంటే ఇష్టమా అంటూ సదరు దర్శకుడు అడిగ్గా, నాన్న అంటే ఇష్టమని సమాధానం ఇచ్చానని తెలిపారు. దీనికి దర్శకుడు స్పందిస్తూ... చాలా సంతోషం... మీ నాన్నకు ఫోన్ చేసి రేపు ఉదయం నేను మిమ్మల్ని ఇంటి వద్ద దింపుతానని చెప్పండని తనతో అన్నాడని, ఆ మాటలు మాట్లాడటంతో తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ఆతర్వాత తాను అక్కడ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు